మహర్షి సంస్థ మానవత్వం: ప్రమాదంలో కాలు కోల్పోయిన బాలుడికి కృత్రిమ కాలు అమరిక
రిపోర్టర్: శివ
స్థలం: పినపాక
మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు తోలెం శ్రీనివాసరావు మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదవశాత్తు కాలు కోల్పోయి మంచానికే పరిమితమైన ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామానికి చెందిన బాలుడు యువిన్ కు జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన కృత్రిమ కాలును ఉచితంగా అమర్చారు. విజయవాడ కేంద్రంగా దాతల సహకారంతో ఈ సహాయం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. తమ కుమారుడికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన సంస్థ సేవలను బాలుడి తల్లిదండ్రులు కొనియాడారు.