డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.

రిపోర్టర్: కృష్ణ స్థలం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. అంబాజీపేట మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది. జెడ్ ప్లస్ భద్రత కారణంగా పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు.