స్వతంత్ర విదేశాంగ విధానంతోనే భారత్ ముందుకు వెళ్తుందన్న విదేశాంగ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: భారత్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా, ఇరాన్‌లపై ఆంక్షలు విధిస్తూ కొత్త చట్టం తెచ్చిన నేపథ్యంలో భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. ఏ దేశం ఒత్తిడికి అనుగుణంగా భారత్ నిర్ణయాలు తీసుకోదని, భారత ప్రజల ప్రయోజనాలే కేంద్రంగా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తామని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తేల్చిచెప్పారు.