దానం నాగేందర్ వ్యవహారంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి బట్టబయలు
రిపోర్టర్: గోపి
స్థలం: Hyderabad
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని పూర్తిగా ఎండగట్టిందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన దానం నాగేందర్ అనర్హత వ్యవహారమే రాజ్యాంగ విరుద్ధ వైఖరికి నిదర్శనమని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.