మహిళలకు ముప్పుగా రొమ్ము క్యాన్సర్: తొలి దశ గుర్తింపుతోనే ప్రాణాపాయం తప్పించవచ్చని నిపుణుల వెల్లడి
రిపోర్టర్: అశోక్
స్థలం: New Delhi
మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు తీవ్రంగా పెరుగుతోందని, తొలి దశలోనే గుర్తించడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చని కటమరాన్ ఇండస్ట్రీస్ సీఈవో డాక్టర్ అరుణ్ అసైతంబి స్పష్టం చేశారు. భారతదేశంలో ప్రతి ఇరవై ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సరైన స్క్రీనింగ్, సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ చికిత్స ఖర్చును తగ్గించుకోవడంతో పాటు పూర్తి ఆరోగ్య భద్రతను సాధించడం సాధ్యమవుతుందని నిపుణులు తెలిపారు.