డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రముఖ రియల్టర్ రాంరెడ్డి ఆత్మహత్య తీవ్ర కలకలం

రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి స్థలం: ఐనవల్లి

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐనవల్లి మండలం నేదునూరులోని తన ఫామ్హౌస్లో ప్రముఖ రియల్టర్, హోమ్ ల్యాండ్ అధినేత రాంరెడ్డి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రస్తుతం పఠాన్ చెరువులో 280 ఎకరాల్లో నూతన వెంచర్ వేస్తున్న ఆయన ఇలా ఆత్మహత్య చేసుకోవడంపై స్థానికంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే రాంరెడ్డి ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వెలువడుతుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.