జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఏపీజేయూ వినతి

రిపోర్టర్: VG ReddyD SrJournalist స్థలం: నెల్లూరు అర్బన్

ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ ప్రతినిధులు శనివారం మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు.

జర్నలిస్టులపై దాడుల నివారణకు హైపవర్ కమిటీల ఏర్పాటు, వెల్ఫేర్ ఫండ్ పునరుద్ధరణ, రైలుపాసులు, ప్రమాదబీమా మరియు ఇంటి స్థలాల కేటాయింపు వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఏపీజేయూ నాయకులు విజ్ఞప్తి చేశారు.