గ్వాలియర్‌లో సిగరెట్ వివాదం పెట్రోల్ బాంబు దాడికి దారితీసింది

రిపోర్టర్: మహేష్ స్థలం: గ్వాలియర్

మధ్యప్రదేశ్ లోని గవాలియర్ లో సిగరెట్ ఇవ్వలేదన్న కోపంతో సోమేశ్ అలియాస్ కొమేశ్ విమల్ అనే వ్యక్తి దుకాణదారుడిపై ఘాతుకానికి పాల్పడ్డాడు. థాటిపూర్ ప్రాంతంలోని పిఎన్ టి కాలనీలో ఉన్న సమృద్ధి స్టోర్ లో సిగరెట్ లేదని చెప్పడంతో దుకాణదారుడు రాథోడ్ తో నిందితుడు గొడవపడ్డాడు. ఆ తర్వాత తన బాల్కనీ నుంచి పెట్రోల్ నింపిన మంటల సీసాను దుకాణంపైకి విసరడంతో దుకాణదారుడు మరియు అతని ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు మంటలను ఆర్పగా, పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.