గోళ్ళకు నల్లటి రంగు వేసుకోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటంటే

రిపోర్టర్: అశోక్ స్థలం: Lisbon

అంతర్జాతీయ ఫుట్బాల్ స్టార్ క్రిస్టో రొనాల్డో తన కాలి గోళ్లకు నల్లటి రంగు వేసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉందని నిపుణులు తెలిపారు. సుదీర్ఘ కాలం పాటు మైదానంలో రాణించేందుకు ఆయన తన ఫిట్నెస్ పై ప్రత్యేక శ్రద్ధ పెడతారని పేర్కొన్నారు. రోజూ గంటల తరబడి బూట్లు ధరించి శిక్షణ పొందడం వల్ల వచ్చే బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ పొందేందుకే ఈ నెయిల్ పాలిష్ ఉపయోగిస్తున్నట్లు క్రీడా వర్గాలు స్పష్టం చేశాయి.