రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారం: ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీలో అశ్వినీ వైష్ణవ్

రిపోర్టర్: కృష్ణ స్థలం: దిల్లీ

ఆంధ్రప్రదేశ్ను సెమీకండక్టర్ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. దిల్లీలో జరిగిన ఈ సమావేశంలో అమరావతి-విశాఖ హైస్పీడ్ రైల్వే కారిడార్ ఏర్పాటుతో పాటు పలు రైల్వే ప్రాజెక్టుల ప్రతిపాదనలపై చంద్రబాబు చర్చించారు. విశాఖ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ రైలును నడపాలని కోరగా కేంద్రమంత్రి అంగీకరించారు.