ఐఆర్‌సీటీసీ రికార్డు బుకింగ్స్, సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ వేళల్లో మార్పు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

పండుగల సీజన్ నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్‌లో చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ 7న అత్యధికంగా 20 లక్షలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. బాట్స్‌పై ఉక్కుపాదం మోపుతూ 3.04 కోట్ల యూజర్ ఐడీలను డియాక్టివేట్ చేశారు. మరోవైపు ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వేళల్లో దక్షిణ మధ్య రైల్వే మార్పులు చేసింది.