పుత్తూరు గంగమ్మ జాతర మహోత్సవానికి మాజీ మంత్రి రోజాకు ఆహ్వానం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: నగరి

పుత్తూరు బజారు వీధిలో ఈ నెల 9న నిర్వహించనున్న శ్రీ గంగమ్మ జాతర మహోత్సవానికి మాజీ మంత్రి ఆర్.కె. రోజాను జాతర కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. నగరిలోని ఆమె నివాసానికి చేరుకుని ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా జాతరలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కమిటీ సభ్యులు కోరారు. జాతర మహోత్సవం ఘనంగా, విజయవంతంగా జరగాలని మాజీ మంత్రి రోజా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.