గ్రామ సేవకు ఘన సన్మానం చేసిన నాయకులు
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సిబ్బంది సేవలను గుర్తించి వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల మురళీధర్ రెడ్డి, సర్పంచ్ బిసు ధనలక్ష్మి చందర్ గౌడ్ పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధిలో సిబ్బంది అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు.