సంస్థాగత నిర్మాణంలో భాగంగా కీలక బాధ్యతలు చేపట్టిన బీజేపీ

రిపోర్టర్: కిరణ్ స్థలం: న్యూఢిల్లీ

రాబోయే ఎన్నికల సన్నాహాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ తన సంస్థాగత నిర్మాణంలో భారీ మార్పులు చేపట్టింది. జాతీయ స్థాయిలో నితిన్ నవీన్ ఆమోదంతో దేశవ్యాప్తంగా 24 మంది కీలక నేతలకు కొత్త బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా ఢిల్లీ, హర్యానా బాధ్యతలు పవన్ రాణాకు, యూపీ బాధ్యతలు ధరంపాల్‌కు కేటాయించారు. అలాగే తెలుగు రాష్ట్రాలకు చెందిన రవీంద్ర రాజుకు అసోం, త్రిపుర బాధ్యతలతో పాటు కార్యాలయ నిర్మాణ పనులను పార్టీ అప్పగించింది.