ఇందిరమ్మ కుట్టుమెషీన్ పథకానికి నాలుగు లక్షలకు పైగా దరఖాస్తులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వరంగల్

రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమెషీన్ పథకానికి నాలుగు లక్షలా డెబ్బై వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. నిన్నటితో దరఖాస్తుల గడువు ముగియగా ప్రతి నియోజకవర్గానికి వెయ్యి చొప్పున ప్రభుత్వం మెషీన్లను పంపిణీ చేయనుంది. మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో లక్షా పందొమ్మిది వేల మందికి వీటిని అందించనున్నారు. అప్లికేషన్ల గడువు ముగియడంతో అధికారులు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియలో నిమగ్నమయ్యారు.