సముద్రపు నేపథ్యంలో క్రీడా డ్రామా: ఆకట్టుకునేలా సూరి మండాడి చిత్రం
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
మథిమారన్ పుగళేంధి దర్శకత్వంలో సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా మండాడి. సంప్రదాయ పడవల పోటీలు, తీరప్రాంత జీవన నేపథ్యంతో ఈ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కిందని చిత్ర యూనిట్ తెలిపింది. సముద్రపు అలల మధ్య సాగే మనుషుల ఆధిపత్య పోరాటాలు, ఆత్మగౌరవ కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సముద్రమే ప్రధాన పాత్రగా నిలుస్తుందని, సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర వర్గాలు వెల్లడించాయి.