ది ప్యారడైజ్ చిత్రానికి ఏపీ ప్రభుత్వ ప్రత్యేక అనుమతులు
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఆంధ్రప్రదేశ్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమా సెప్టెంబరు 24న విడుదల కానున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. సెప్టెంబరు 23న జరిగే ప్రీమియర్ షోల కోసం మల్టీప్లెక్స్‌లలో రూ.400, సింగిల్ స్క్రీన్లలో రూ.300గా టికెట్ ధరలను ఖరారు చేసింది. అలాగే సెప్టెంబరు 24 నుండి అక్టోబరు 3 వరకు పది రోజుల పాటు మల్టీప్లెక్స్‌లలో రూ.75, సింగిల్ స్క్రీన్లలో రూ.50 చొప్పున అదనంగా పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది.