పిల్లిగుండ్ల తండా లబ్ధిదారుడికి అందజేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కు
రిపోర్టర్: Madhu Bngr
స్థలం: బొమ్మలరామారం
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం పిల్లిగుండ్ల తండాకు చెందిన లబ్ధిదారునికి ఆపద సమయంలో ప్రభుత్వం భరోసా కల్పించింది. ఇందులో భాగంగా వైద్యం కోసం మంజూరైన రూ.60 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును స్థానిక నాయకులు లబ్ధిదారునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ వాలు నాయక్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు దిరావత్ రాందాస్ నాయక్ తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.