శ్రీకాకుళం జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నివారణకు డ్రోన్ల ద్వారా ప్రత్యేక నిఘా

రిపోర్టర్: భాస్కర్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లాలో బహిరంగ ప్రదేశాలలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ వెల్లడించింది. ఈ అత్యాధునిక నిఘా వ్యవస్థను జిల్లాలోని శ్రీకాకుళం గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో పాటు నాగావళి పరిసరాల్లో పకడ్బందీగా అమలు చేస్తున్నామని, శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది.