ఇండియన్ బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026: దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఇండియన్ బ్యాంక్ భారీ గుడ్ న్యూస్ అందించింది. బ్యాంక్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అధికారిక ప్రకటన విడుదల చేసినట్లు బ్యాంక్ అధికారులు వెల్లడించారు. నవంబర్ 25, 2026 వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇరవై నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయస్సు కలిగి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు అర్హులని బ్యాంక్ వర్గాలు స్పష్టం చేశాయి.