కాగ్నిజెంట్ గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్ దరఖాస్తులపై అమెరికా నిషేధం
రిపోర్టర్: హరి
స్థలం: అమెరికా
వీసా నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌కు అమెరికా శ్రామిక శాఖ గట్టి షాకిచ్చింది. కొత్త గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అమెరికన్ కార్మికుల హక్కులను కాపాడేందుకు ఎలాంటి బెదిరింపులను సహించబోమని లేబర్ డిపార్ట్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి ఎస్పోసిటో స్పష్టం చేశారు. వీసా దుర్వినియోగంపై విచారణ కొనసాగుతోంది.