సామాన్యులకు భారీ ఊరట: కిలో బీపీటీ బియ్యం ధర రూ. 66కు పరిమితం
రిపోర్టర్: రాజేష్
స్థలం: Hyderabad
రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న బియ్యం ధరలకు అడ్డుకట్ట వేసేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్లో విక్రయించే నాణ్యమైన బీపీటీ రకం బియ్యం గరిష్ట ధరను కిలోకు రూ. 66 మించకుండా ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. నిబంధనలను అతిక్రమించి అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 12 కేసులు నమోదు చేసినట్లు మంత్రి హెచ్చరించారు. అక్రమ నిల్వలు చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆయన స్పష్టం చేశారు.