సెప్టెంబర్ 7న మణిరత్నం-విజయ్ సేతుపతి కొత్త సినిమా టైటిల్ ప్రకటన
రిపోర్టర్: కిరణ్
స్థలం: India
దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా నటిస్తున్న కొత్త సినిమా టైటిల్‌ను సెప్టెంబర్ 7న ప్రకటించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి. మణిరత్నం మార్క్ ఎమోషన్స్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రేమకథపై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.