లక్ష్మీపురం గ్రామంలో కార్డన్ సెర్చ్: భారీగా అక్రమ మద్యం బాటిళ్లు స్వాధీనం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: కర్నూలు
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో లక్ష్మీపురం గ్రామంలో కర్నూలు రూరల్ పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ముగ్గురు వ్యక్తుల నుంచి 672 అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు Kurnool Police వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం భవిష్యత్తులోనూ ఇటువంటి విస్తృత తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.