తీవ్ర వాతావరణ మార్పులతో కనుమరుగవుతున్న సీతాఫలం: ఆకాశాన్నంటుతున్న ధరలు
రిపోర్టర్: గోపి
స్థలం: Nizamabad
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ మార్పులు మరియు ఎల్ నినో ప్రభావంతో సీతాఫలం పంట దిగుబడులు భారీగా పడిపోయాయని, నిజామాబాద్ జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల్ లో చెట్లు తగ్గిపోవడంతో మార్కెట్ లో ధరలు ఆకాశాన్నంటుతున్నాయని స్థానిక నిపుణులు తెలిపారు. కాలం కాని వర్షాలు, అక్రమ మొరం వ్యాపారాల కారణంగా గుట్టలు, అడవులు ధ్వంసమై సీతాఫలాల చెట్లు అంతరించిపోతున్నాయని, దీనివల్ల గిరిజనుల ఉపాధి దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.