మొదటిసారిగా కోనేరు హంపి ఆటను ప్రత్యక్షంగా వీక్షించిన కుమార్తె అహన.
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: కర్ణాటక
గ్లోబల్ చెస్ లీగ్ ఫైనల్స్‌లో ఏపీఎల్ పైపర్స్ తరఫున ఆడుతున్న ప్రముఖ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఆటను ఆమె తొమ్మిదేళ్ల కుమార్తె అహన తొలిసారిగా ప్రత్యక్షంగా వీక్షించింది. ఈ అరుదైన క్షణాలను హంపి భర్త దాసరి అన్వేష్ పంచుకుంటూ, కుటుంబానికి, క్రీడకు హంపి సమతుల్యత పాటిస్తుందని తెలిపారు.