బీసీలకు 34 శాతం సీట్లు ఇస్తామంటూ సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టీకరణ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బీసీలకు ముప్పై నాలుగు శాతం కంటే ఎక్కువ సీట్లు ఇస్తామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. న్యాయస్థానం తీర్పును గౌరవిస్తామని, ఇచ్చిన మాటను కచ్చితంగా నిలబెట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. సర్వేపల్లిలో ఎంపీటీసీ మరియు సర్పంచ్ పదవులలో ముప్పై నాలుగు శాతానికి మించి బీసీలకే కేటాయిస్తామని తెలిపారు. రిజర్వేషన్లకు అడ్డుపడిన వారు ఎవరనేది ప్రజలందరికీ తెలుసని, ఎన్నికలు ఆపాలని వేసిన కేసులను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.