ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
రిపోర్టర్: నరేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు జోరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వెదర్‌మ్యాన్ తెలిపారు. కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచించారు.