వీఐపీ దర్శనాల లేఖల రద్దుపై తిరుమలలో భక్తుల ఆందోళన

రిపోర్టర్: శివ స్థలం: తిరుమల

శ్రీవారి వీఐపీ దర్శనాల సిఫార్సు లేఖలను అధికారులు స్వీకరించకపోవడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు భక్తులు వాపోయారు. సుదూర ప్రాంతాల నుంచి ఎంతో కష్టపడి తెచ్చుకున్న లేఖలను ఆకస్మికంగా రద్దు చేయడం సమంజసం కాదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలోని జేఈఓ కార్యాలయం ఎదుట భక్తులు బైఠాయించి నిరసన తెలిపినట్లు భక్తులు పేర్కొన్నారు. భక్తుల ఆందోళన నేపథ్యంలో స్పందించిన టీటీడీ అధికారులు వారికి రూ. మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కేటాయించడంతో వివాదం సద్దుమణిగినట్లు అధికారులు తెలిపారు.