నిద్రలేమి సమస్యకు చెక్: సరికొత్త టెక్నాలజీతో మెదడును ఉత్తేజపరిచే పరికరం
రిపోర్టర్: సురేష్
స్థలం: న్యూఢిల్లీ
నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టేందుకు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు ప్రత్యేకంగా న్యూస్ లీప్ అనే సరికొత్త సాఫ్ట్ వేర్ ప్యాచ్ ను అభివృద్ధి చేసినట్లు కై వింగ్ కేవిన్ ట్యాంగ్ వెల్లడించారు. అల్ట్రాసౌండ్ తరంగాల ద్వారా మెదడును ఉత్తేజపరుస్తూ మందులు లేకుండానే నిద్ర నాణ్యతను పెంచే ఈ టెక్నాలజీ భవిష్యత్తులో నిద్ర సంబంధిత రుగ్మతలకు చక్కటి పరిష్కారం చూపుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.