విజయవాడలో వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై అర్ధరాత్రి పోలీసుల దాడులు
రిపోర్టర్: అశోక్
స్థలం: విజయవాడ
విజయవాడలో డీఎస్సీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారనే కారణంతో వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై అర్ధరాత్రి పోలీసులు దాడులు చేయడం కలకలం రేపింది. రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చిత్రాల ఓబేదు, రేపల్లె యువజన విభాగం అధ్యక్షుడు, బీసీ నేత రాజ్‌పాల్ యాదవ్ ఇళ్లకు అర్ధరాత్రి సమయంలో పోలీసులు వెళ్లడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. నిరసనల పేరుతో అక్రమ కేసులు బనాయించి అరెస్టులకు పాల్పడుతున్న తీరుపై సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.