ఎన్నికలు రిగ్గింగ్ అవుతుంటే వాటిని బహిష్కరించాలంటూ అభిజీత్ దిప్కే సవాల్
రిపోర్టర్: సునీల్
స్థలం: న్యూఢిల్లీ
ఎన్నికలు రిగ్గింగ్ జరుగుతున్నాయని ఆరోపిస్తూనే వాటిలో పాల్గొనడం వల్ల ఆ ప్రక్రియకు చట్టబద్ధత కల్పిస్తున్నట్లు అవుతుందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజీత్ దిప్కే పేర్కొన్నారు. రాజకీయ మనుగడ కోసం రాజీ పడకుండా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విపక్షాలకు ఆయన సూచించారు. రిగ్గింగ్ ఆరోపణలు వస్తున్న ఎన్నికలను విపక్షాలు పూర్తిగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.