విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే మాధవి

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: విజయనగరం

చిన్నారుల భవిష్యత్తే తన ప్రధాన బాధ్యతగా భావించి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీపై ప్రత్యేక అవగాహన కల్పించారు. నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవవిధాన్ని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని టెక్నాలజీ అంశాలను ఆసక్తిగా తెలుసుకున్నారు. నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తన వంతు కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.