బిగ్ బాస్ హౌస్లో సృష్టి మరియు సుధీర్లపై నాగార్జున ఆగ్రహం

రిపోర్టర్: విజయ్ స్థలం: Hyderabad

బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్లో కంటెస్టెంట్లు సృష్టి మరియు సుధీర్లపై హోస్ట్ నాగార్జున తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని నిర్వాహకులు తెలిపారు. నామినేషన్స్ సమయంలో సుధీర్తో గొడవ పడిన తీరును, చెత్త వేసిన ఘటనను నాగార్జున తప్పుబట్టారు. ఈ క్రమంలో సృష్టి కన్నీటిపర్యంతమయ్యారని వెల్లడించారు. రోహిత్, త్రిగుణాల వ్యూహాలకు ఎందుకు బలి అవుతున్నారంటూ సుధీర్ను నాగార్జున నిలదీశారని, ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని పేర్కొన్నారు.