జలదంకి రోడ్డు ప్రమాదం: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
రిపోర్టర్: సునీల్
స్థలం: జలదంకి
జలదంకి మండలంలోని చినక్రాక సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెరుకూరి రమేష్ అనే వ్యక్తి దుర్మరణం చెందారని పోలీసులు తెలిపారు. పొలం పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందని ఎస్సై వీరేంద్రబాబు వెల్లడించారు. తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కావలి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.