తీవ్రవాయుగుండం ప్రభావంతో విజయనగరం జిల్లాలో భారీగా నష్టపోయిన రైతులు
రిపోర్టర్: రమేష్
స్థలం: చీపురుపల్లి
తీవ్రవాయుగుండం ప్రభావంతో చీపురుపల్లి మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బొప్పాయి, జొన్న, మునగ, అరటి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. సుమారు తొంబై ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారి సూర్య కళ తెలిపారు. రహదారిపై వరద ప్రవహించడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు పదిహేను లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.