బెంగళూరు నుంచి విజయవాడ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం

రిపోర్టర్: సురేష్ స్థలం: బెంగళూరు

బెంగళూరు నుంచి విజయవాడకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విమానంలో ఏపీ మంత్రి మండపల్లి రామప్రసాద్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ప్రయాణిస్తున్నారు. టేకాఫ్‌కు సిద్ధమైన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యను గుర్తించడంతో పైలట్లు విమానాన్ని తిరిగి బే వద్దకు తీసుకువచ్చారు. వెలగపూడి సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యేందుకు మంత్రి రామప్రసాద్ రెడ్డి ఈ విమానంలో ప్రయాణిస్తుండగా, ఈ పరిణామంతో ప్రయాణికులు విమానాశ్రయంలో నిరీక్షించాల్సి వచ్చింది.