శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయానికి ఇత్తడి చెమ్మలు బహుకరించిన ప్రవాస మహిళ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: హుస్నాబాద్

హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామానికి చెందిన, ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్న వారణాసి కావ్య రమేష్ రూ.45 వేల విలువైన రెండు జతల ఇత్తడి చెమ్మలను దీపారాధన కోసం శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయానికి బహుకరించారు. బుర్ర గణేష్ మిత్రుల ద్వారా వాటిని ఆలయానికి అందజేశారు. గతంలోనూ రూ.10,116 విరాళంగా అందించారు. దాత కుటుంబానికి స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని సర్పంచ్ తోడేటి రమేష్ ఆకాంక్షించారు.