రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన నేతలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. మట్టి ప్రతిమలను పూజిస్తూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మన సంస్కృతి, సంప్రదాయాలను మరింత వైభవంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడాలని గణనాథుడిని ప్రార్థించారు.