నైజీరియాలో విషపూరిత పానీయం తాగి 48 మంది మృతి
రిపోర్టర్: అశోక్
స్థలం: నైజీరియా
నైజీరియాలో మిథనాల్ ఉన్నట్లు అనుమానిస్తున్న ఓ పానీయం తాగిన ఘటనలో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికిపైగా అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దక్షిణ నైజీరియాలోని ఒండో రాష్ట్రంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బాంజీ అజాకా తెలిపిన వివరాల ప్రకారం ఒడిగ్బో, ఇరెలె స్థానిక ప్రభుత్వ ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇప్పటికే 15 మందిని అరెస్టు చేసినట్లు ఒండో రాష్ట్ర పోలీసు ప్రతినిధి అబయోమి జిమోహ్ తెలిపారు.