విమానయాన రంగంలోకి అదానీ గ్రూప్ ప్రవేశించే ఆలోచన లేదు: సీఈవో బన్సల్

రిపోర్టర్: సురేష్ స్థలం: New Delhi

విమానయాన రంగంలోకి ప్రవేశించే ఎలాంటి ఉద్దేశం తమకు లేదని అదానీ ఎయిర్ పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ సీఈవో అరుణ్ బన్సల్ స్పష్టం చేశారు. సొంత వినియోగదారులతోనే పోటీ పడటం ఎప్పుడూ మంచి వ్యూహం కాదని ఆయన మంగళవారం తెలిపారు. ఏవియేషన్ ఇండియా అండ్ సౌత్ ఆసియా 2026 సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తమ పరిధిలో ఎనిమిది ఎయిర్ పోర్టులు ఉన్నాయని, భవిష్యత్తులో ప్రైవేటీకరణ ప్రక్రియలో పాల్గొంటామని అరుణ్ బన్సల్ వెల్లడించారు.