పదోతరగతిలో 90శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యం: మంత్రి లోకేశ్‌

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

పదోతరగతిలో ఈ ఏడాది 90 శాతం ఉత్తీర్ణత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. మిషన్‌ మార్చిపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టిసారించాలని ఆదేశించారు. 2027 డిసెంబరు నాటికి రాష్ట్రంలో వందశాతం అక్షరాస్యత సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. విద్యతో పాటు డిజిటల్, ఫైనాన్షియల్‌ అక్షరాస్యతపైనా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.