అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో భారీ మార్పులు: తగ్గిన నిర్మాణ వ్యయం

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

అమరావతి అవుటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నట్లు జాతీయ రహదారుల సంస్థ అధికారులు తెలిపారు. వ్యయం తగ్గించే లక్ష్యంతో రెండు ఇంటర్ చేంజ్ లు తొలగించడంతో పాటు సర్వీస్ రోడ్ల ప్రణాళికను సవరించినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం ముప్పై వేల కోట్ల రూపాయలకు తగ్గిందని అధికారులు స్పష్టం చేశారు.