మున్సిపల్ ఎన్నికల పరిశీలన పూర్తి: పలుచోట్ల టీడీపీ ఏకగ్రీవ విజయాలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పత్రాల్లో తప్పుల కారణంగా పలువురి నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, దాచేపల్లి, రాజంపేట, బద్వేలు పురపాలికల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యే అవకాశం దక్కింది. మరోవైపు శాంతిభద్రతల సమస్యల కారణంగా మైదుకూరు పురపాలక ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. పార్వతీపురంలో అత్తాకోడళ్లు ఒకే పోరులో నిలవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.