అస్సాంలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా సీఎం హిమంత హెచ్చరిక

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Dispur

అస్సాంలో నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ స్పష్టం చేశారు. సోషల మీడియా వేదికగా ఆయన 'ది లాఫాదర్' పోస్టర్ను పంచుకుంటూ, రాష్ట్రంలో చార్జ్షీట్ రేటు రెండున్నర రెట్లు పెరిగి 85 శాతానికి చేరిందని వెల్లడించారు. అసాంఘిక శక్తుల భరతం పట్టేందుకు దోషుల నిర్ధారణ రేటు ఆరు సంవత్సరాలలో 8 శాతం నుండి 29.3 శాతానికి పెరిగిందని, నేర రహిత అస్సాం సాధించే వరకు విశ్రమించేది లేదని ఆయన తేల్చిచెప్పారు.