పెద్దకొండూర్లో భక్తిశ్రద్ధలతో ఘనంగా కాటమయ్య బోనాలు
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మండలం పెద్దకొండూర్ గ్రామంలో కాటమయ్య బోనాల వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాటమయ్య స్వామికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుండేబోయిన శిరీష ఇస్తారి యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని స్వామిని ప్రార్థించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.