నెల్లూరు జిల్లాలో విద్యుదాఘాతంతో హోంగార్డు మృతి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ క్వార్టర్స్‌లో వినాయక చవితి మండపం వద్ద సీరియల్ బల్బులు అమరుస్తుండగా విద్యుదాఘాతంతో హోంగార్డు ప్రసాద్ మృతి చెందారు. డీఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న ఆయన షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ అకాల మృతితో పోలీస్ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.