పలాస మున్సిపాలిటీ పరిధిలో ఏడు లక్షలతో నూతన సీసీ రోడ్డు శంకుస్థాపన
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని నాల్గవ వార్డులో రూ.7.80 లక్షల నిధులతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజల రాకపోకల ఇబ్బందులు తొలగించేందుకు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని, పనులను నాణ్యతతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆమె తెలిపారు.