'ఎమ్మెల్యేలపై దాడులా? సిగ్గు.. సిగ్గు': రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: రమేష్
స్థలం: Hyderabad
అసెంబ్లీ వద్ద పోలీసుల దురుసు ప్రవర్తనలో గాయపడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తెలంగాణ భవన్‌లో వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులపై పోలీసుల దాడులను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై దాడులకు తెగబడటం సిగ్గుచేటని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.