గిరిజన యువతకు పోలీస్ కొలువుల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని సీఎంను కోరిన ఎమ్మెల్యేలు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన యువత ఉద్యోగ హక్కులను పరిరక్షించాలని కోరుతూ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. 2026 పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో 75 శాతం ప్రత్యేక రిజర్వేషన్ పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.